నాకు ఆ ధైర్యం ఉందిః ఆర్ఎక్స్ 100హీరోయిన్

674
payal-rajput
- Advertisement -

రెండు రోజుల క్రితం విడుద‌లై ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న చిత్రం ఆర్ఎక్స్ 100. మొద‌టి షో నుంచే ఈసినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఈసినిమాలో హీరో, హీరోయిన్ న‌ట‌నకు ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు. వీకెండ్ కావ‌డంతో ఈసినిమాకు మ‌రిన్ని క‌లెక్ష‌న్లు రానున్న‌ట్లు చెబుతున్నారు ట్రేడ్ వ‌ర్గాలు. రాంగోపాల్ వ‌ర్మ శిష్యుడు అజయ్ భూప‌తి ఈసినిమాను తెర‌కెక్కించాడు.

Payal-Rajput

కార్తిక్తేయ క్రియేటివ్ బ్యాన‌ర్ పై ఈసినిమాను నిర్మించ‌గా… కార్తికేయ‌, పాయల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్లుగా ప‌రిచ‌యం అయ్యారు. ఇక హీరోయిన్ న‌ట‌న‌, అందంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఎక్కువ‌గా యూత్ ను ఆక‌ట్టుకునే లా ఈసినిమాను తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి. ఈసినిమాలో హీరోయిన్ పాత్ర రోటిన్ కంటే కొంచెం బోల్డ్ గా ఉండ‌టంతో ఆ పాత్ర‌లో ఆమె న‌టించినందుకు ప‌లువురు పాయ‌ల్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Payal-Rajput

ఈసంద‌ర్భంగా హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ.. ఇంత బోల్డ్ గా న‌టించాలంటే చాలా ధైర్యం కావాల‌ని..త‌నకు ఆధైర్యం ఉంది కాబ‌ట్టి ఈసినిమాలో న‌టించాన‌ని చెప్పింది. ఈపాత్ర‌ను చాలా మంది హీరోయిన్లు నిరాక‌రించార‌ని, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ను చేయాలంటే సాహసం చేయాల‌న్నారు. ఈసినిమాలో నా క్యారెక్ట‌ర్ పై చాలా మంది విమ‌ర్శ‌లు చేశార‌ని కానీ నేను అవేవి ప‌ట్టించుకోలేద‌న్నారు హీరోయిన్ రాజ్ పుల్ పాయ‌ల్.

- Advertisement -