సినిమా వాళ్లే తప్పు చేశారా..?

196
- Advertisement -

టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్ అంశంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ లేటైనా తనదైన శైలీలో స్పందించారు. హైదరాబాద్‌ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అకున్ సబర్వాల్ తీవ్రంగ శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాపై అక్కసు వెల్లగక్కాడు వర్మ. తెలుగు మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ దందాపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్న వేళ, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివరణ ఇచ్చాడు.

Tollywood Being Targeted in Drug Case Says Ram Gopal Varma

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఈడీ అకున్ సబర్వాల్ నిజాయతీపై తనతో సహా ఎవరికీ అనుమానాలు లేవని అన్నాడు. అయితే, మీడియాకు లీకులిస్తున్న అంశాన్ని మాత్రమే తాను ప్రశ్నించానని, నటుల ఇమేజ్ ను దెబ్బతీసే ఈ తరహా చర్యలను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారని అడిగానని ఆయన తెలిపాడు.

Tollywood Being Targeted in Drug Case Says Ram Gopal Varma

అయితే సినీ ప్రముఖులకు మాత్రమే నోటీసులు ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, డ్రగ్స్ దందాలో పేరున్న రాజకీయ నేతలు, వీఐపీలు లేదా మరెవరైనా, అన్ని వర్గాలనూ కలిపి నోటీసులు ఇచ్చి విచారించి వుంటే, ఈ తరహా విమర్శలు వచ్చుండేవి కాదని అభిప్రాయపడ్డాడు. కేసులో ఎంతో మంది పేర్లు లీకవుతున్నాయని, అయితే, సినిమా వాళ్లే తప్పు చేస్తున్నారన్న సంకేతాలు ఇస్తూ, మిగతా అన్ని వర్గాల వారినీ ఎందుకు వదిలేస్తున్నారన్నదే తన ప్రశ్నని తెలిపాడు.

- Advertisement -