జపాన్‌లో మరోసారి ఎమర్జెన్సీ….

145
tokyo
- Advertisement -

జపాన్‌లో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. జులై 12 నుంచి 22 వ‌ర‌కు ఎమ‌ర్జెన్సీ అమ‌లులో ఉంటుందని ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు. మూడో ఎమ‌ర్జెన్సీ జులై 11తో ముగియ‌నున్న త‌రుణంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దేశ రాజ‌ధాని టోక్యోతో స‌హా ప్ర‌ధాన న‌ర‌గాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

మిగ‌తా వేరియంట్ల కంటే డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండ‌టంతో పాటు, తీవ్ర‌త కూడా అధికంగా ఉండ‌టంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ‌రోసారి ఎమ‌ర్జెన్సీని విధిస్తున్న‌ట్టు ఆ దేశ ప్ర‌ధాని పేర్కొన్నారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో రోడ్ల‌పైకి ప్రజ‌లు గుంపులుగా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉండదు. పార్టీల‌కు, స‌మావేశాల‌కు అనుమ‌తులు ఉండ‌వు. ఎవ‌రి ఇంట్లో వాళ్లు ఉండాలి…. అన‌వ‌స‌రంగా రోడ్ల‌మీద‌కు వ‌స్తే కేసులు న‌మోదుచేసి జైలుశిక్ష విధించే అవ‌కాశం ఉంటుంది.

మ‌రో నాలుగు రోజుల్లో టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఒలంపిక్స్‌కు 50శాతం మంది ప్ర‌జ‌ల‌కు అనుమ‌తి ఇస్తామ‌ని మొద‌ట చెప్పినా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా, ప్రేక్ష‌కులు లేకుండానే విశ్వ‌క్రీడ‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

- Advertisement -