రికార్డుకి చేరువలో పసిడి ధర..!

465
gold rate
- Advertisement -

పసిడి ధరలు కొండెక్కాయి. రికార్డు స్దాయిలో గరిష్ట ధరకు చేరుకున్నాయి బంగారం ధరలు. 10 గ్రాముల బంగారం రూ. 50 వేలకు చేరుకుంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,865 ఉండగా కిలో వెండి ధర మూడు శాతం పెరిగి రూ.48,208ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,408గా ఉండగా 24 గ్రాముల బంగారం ధర రూ. 48,510గా ఉంది.

పసిడి ధరలు ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయి. అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా, జపాన్‌ దేశాల బలహీన ఎకానమిక్‌ డేటా ఇవన్నీ కలిసి పసిడి ధరను భారీగా పెంచేశాయి. దీనికి తోడు కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.

- Advertisement -