ఛార్మీ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది..!

509
charmi
- Advertisement -

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన అందాల భామ ఛార్మీ ప్ర‌స్తుతం పూరీ క‌నెక్ట్స్ బేన‌ర్‌పై ప‌లు సినిమాలు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన ఛార్మీ త్వ‌ర‌లో ఫైట‌ర్ అనే సినిమాని అభిమానుల ముందుకు తీసుకు రానుంది.

ఇక సోమవారం బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న ఛార్మీ…ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఇకపై తాను నటించదలుచుకోలేదని స్పష్టం చేసింది.

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తున్నారని… ఈ తరుణంలో తాను నటించాలి అనుకోవడం లేదని తెలిపింది. జ్యోతిలక్ష్మి సినిమా సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెబుదామని అనుకున్నానని కానీ పూరి జగన్నాథ్ సలహాతో నిర్ణయాన్ని మార్చుకున్నానని తెలిపారు ఛార్మీ.

- Advertisement -