జీవితకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య నడుంనొప్పి. సగటున ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ఎన్నో రకాలైన మందులు..వ్యాయామాలు చేసిన అప్పుడప్పుడు నడుంనొప్పి బాధ పెడుతూ ఉంటుంది. ఇందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే నడుంనొప్పి నుండి దూరం కావచ్చు.
ఎలా కూర్చోవాలి..?
ముందుకు వంగిగానీ, వెనక్కివాలి గానీ కూర్చుంటే వెన్నుముకకు హాని కలుగుతుందన్నది నిజమే. అలాగని పూర్తి నిటారుగా చాలా సమయం కూర్చున్నా వెన్నుముక అలసిపోతుంది. అందువల్ల ఎక్కువ సమయం కూర్చోవాల్సి వస్తే కుర్చీ వెనుక భాగానికి వెన్నును ఆన్చి కొద్దిగా ముందుకు వంగి కూర్చోవాలి. కాళ్లు నేలను తాకి ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కూర్చొని ఉండకుండా గంటకోసారి లేచి కాస్త నడవాలి. ఫోన్ మాట్లాడాల్సి వస్తే నిలబడి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. వెన్నెముకకు బలాన్నించే వ్యాయామాలు, క్రమంతప్పకుండా చెయ్యడం వల్ల కూడా నడుమునొప్పికి చెక్ పెట్టవచ్చు.
నడుముకు ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి, వాపు వస్తుంది. ఈ సమయంలో వాపు ఉన్న భాగంలో చల్లని లేదా వేడి కాపడం పెట్టడం చేయాలి. నడుము తీవ్రంగా నొప్పి పెడుతున్న సందర్భంలో కొంత సమయం పాటు విశ్రాంతిగా పడుకోవడం మంచిది. కానీ ఈ విశ్రాంతి కొద్ది సమయం పాటు మాత్రమే చేయాలి. వంద గ్రాముల గసగసాలను మెత్తటి పొడిని రెండు చెంచాల మోతాదులో తీసుకుని గ్లాసు పాలలో కలుపుకొని తాగాలి. నడుమునొప్పితో పాటుగా జ్వరం, మలబద్దకం, లేక మూత్రవిసర్జన మీద పట్టు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు కూడా బాధిస్తున్నపుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొబ్బరి, బాదం, నీలగిరి తైలం.. ఇలా ఏదో ఒక నూనెను గోరువెచ్చగా చేసి దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో బాగా మసాజ్ చేయాలి.
Also Read:KTR:దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
నడుంనొప్పిని తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులతో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగా, ఈత.. వంటి సులభమైన వ్యాయామాలను చేయడం మంచిది. నొప్పిని, వాపును తగ్గించడానికి ఐస్ ఎంతగానే ఉపయోగపడుతుంది. కొన్ని ఐస్ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి.. దాన్ని టవల్‌లో మూటకట్టాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.
మహిళలు కాస్త జాగ్రత్త..
మహిళల్ని ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యల్లో నడుంనొప్పి కూడా ఒకటి. ఇంట్లో రోజువారీ పనులు చేయడం వల్ల, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చే నడుమునొప్పి.. లేదా నెలసరి సమయంలో సాధారణంగా వచ్చే నొప్పి ఇలాంటి మహిళల జీవితాల్లో సహజం.. ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి చాలామంది మహిళలు రకరకాల క్రీములను ఆశ్రయిస్తుంటారు. అయితే వీటి ప్రభావం కొద్దిసేపటికే పరిమితం కావచ్చు. వీటివల్ల నొప్పి పూర్తిగా తగ్గక, మళ్లీ ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది. నడుంనొప్పి నుంచి పూర్తి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
గసగసాల పొడితో..
వంద గ్రాముల గసగసాలను మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాని నుంచి రెండు చెంచాల పొడి తీసుకొని గ్లాసు పాలలో కలుపుకొని తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల నడుంనొప్పి తక్షణం తగ్గే అవకాశం ఉంటుంది.
Also Read:IPL 2023:ఎవరికి ఎంత ప్రైజ్‌మనీ అంటే?
అల్లంతో ఉపశమనం..
అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుని మరిగించాలి. అందులో ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసి కనీసం పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. దీనిలో కాస్త తేనె వేసి బాగా కలుపుకుని తాగితే నడుంనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. లేదంటే కాస్త అల్లం పేస్ట్‌ను నొప్పి ఉన్న చోట రాసి ఓ పది నిమిషాల పాటు అలాగే ఉంచుకుని కడిగేసుకోవాలి. తర్వాత నీలగిరి తైలం రాసుకుంటే చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో సహకరిస్తాయి.
చల్లచల్లగా..
నొప్పిని, వాపును తగ్గించడంలో ఐస్‌ను మించింది మరోటి లేదు. అందుకే కొన్ని ఐస్ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి.. దాన్ని టవల్‌లో మూటకట్టాలి. దీంతో నొప్పి ఉన్న ప్రదేశంలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. ఇలా నొప్పి తగ్గేంత వరకూ అరగంటకోసారి చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది.
తులసి మిశ్రమం..
ఒక పాత్రలో కప్పు నీరు తీసుకోవాలి. అందులో పది తులసి ఆకుల్ని వేసి నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత చల్లారనిచ్చి, వడకట్టి.. అందులో చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని సాధారణ నొప్పి ఉన్నప్పుడు ఒకసారి, కాస్త ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు రెండుసార్లు తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
మసాజ్‌తో మటుమాయం..
శరీరంపై అధిక పనిభారం పడినప్పుడు కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడి తద్వారా కండరాల్లో నొప్పి వస్తుంది. ఇది నడుంనొప్పికి దారితీస్తుంది. కాబట్టి ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మసాజ్ మంచి ప్రక్రియ. కొబ్బరి, బాదం, నీలగిరి తైలం.. ఇలా ఏదో ఒక నూనెను గోరువెచ్చగా చేసి దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో బాగా మసాజ్ చేయాలి. ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనం కలగడంతో పాటు కండరాలకు విశ్రాంతి లభిస్తుంది.
కాస్త కొబ్బరి లేదా నువ్వుల నూనెలో ఓ పది వెల్లుల్లి రెబ్బల్ని వేసి సన్నని మంటపై వేడిచేయాలి. వెల్లుల్లి రెబ్బలు గోధుమ రంగులోకి మారిన తర్వాత దింపేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తర్వాత నూనెను వడకట్టుకుని దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేసుకోవాలి. కాసేపు అలాగే ఉంచుకుని గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. తద్వారా త్వరిత ఉపశమనం కలుగుతుంది.
Also Read:IPL 2023:గుజరాత్ కొంప ముంచిందదే!
సులభమైన వ్యాయామాలు..
నడుంనొప్పిని తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన పద్ధతులతో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగా, ఈత.. వంటి సులభమైన వ్యాయామాలను చేయడం మంచిది. వారానికి కనీసం మూడు గంటల పాటు ఈ రకమైన వ్యాయామాలు చేయడం వల్ల నడుంనొప్పిని 20 శాతం వరకు తగ్గించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
చూశారుగా.. నడుంనొప్పిని సహజసిద్ధంగా తగ్గించుకునేందుకు ఎలాంటి మార్గాలున్నాయో.మరి మీకెప్పుడైనా నడుంనొప్పి వేధిస్తున్నట్లయితే వీటిని పాటించి నొప్పి నుంచి ఉపశమనం పొందండి..!