కళ్ళ కింద నల్ల మచ్చలు తగ్గించండిలా!

43
- Advertisement -

చాలామందికి కళ్ళ కింద నల్లటి వలయల్లాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు నలుగురిలో ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మచ్చలు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఎండలో ఎక్కువగా బయట తిరగడం, దుమ్ము ధూళి కాలుష్యం వంటి వాటి కారణంగా కూడా ఈ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇంకా గంటల తరబడి కంప్యూటర్ లేదా మొబైల్ ను చూడడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా కళ్ళ కింద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అయితే ఈ మచ్చలను దూరం చేసుకోవడానికి ఏవేవో మెడిసన్స్ వాడడం కన్నా చక్కటి ఇంటి చిట్కాలు చాలా బాగా పని చేస్తామని బ్యూటీషియన్లు చెబుతున్నారు..

చర్మంపై మచ్చలను తొలగించి మెరిసేలా చేసేందుకు టమాటో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్ టమాటో జ్యూస్ కు కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ళ కింద రాసుకోవాలి. 10-15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లకింద నల్లటి వలయాలు మాయమౌతాయి. అల్మండాయిల్ కూడా ఈ మచ్చలను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది.

ప్రతిరోజూ రాత్రి కొద్దిగా అల్మండాయిల్ ను తీసుకొని కళ్ళ కింద నల్లటి మచ్చలపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే లేచి చన్నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల నల్లటి వలయాలు త్వరగా తగ్గిపోతాయి. ఇంకా ఆరెంజ్ జ్యూస్ కూడా ఈ మచ్చలను పోగొట్టడంలో సహకరిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ కు కొద్దిగా గ్లిజరిన్ కలిపి కళ్ళ కింద ఉండే ఆ మచ్చలపై పూయలి. పది నిముషాల తరువాత కడగాలి. ఇలా చేయడం ద్వారా నల్ల మచ్చలు దూరమవుతాయి. ఈ చిట్కాలతో పాటు మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తినడం, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినడం వంటివి చేయాలి. అలాగే మొబైల్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ కు వీలైనంత దూరంగా ఉండాలి.

Also Read:IND vs ENG :అదరహో.. సిరీస్ కైవసం!

- Advertisement -