నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన రోజువారీ దినచర్య లో స్మార్ట్ ఫోన్ అనేది భాగమైపోయింది. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. అందుకే స్మార్ట్ ఫోన్ ఎల్లప్పుడు చేతిలోనే ఉంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కడో పెట్టి మర్చిపోవడం, లేదా ఎవరోకరు దొంగిలించడం, లేదా ఎక్కడో పడిపోవడం వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత మొబైల్ కు కాల్ చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే మొబైల్ ఇతరులు తీసుకుంటే దానిని స్విచ్ ఆఫ్ చేయడం లేదా సిమ్ తీసివేయడం వంటివి చేస్తారు. అందువల్ల చేసేదేమీ లేక మళ్ళీ కొత్త ఫోన్ కొనుకుంటూ ఉంటారు.
కొంతమంది ఖరీదైన ఫోన్ పోగొట్టుకున్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంటారు. అయితే ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కూడా సరిగా రెస్పాండ్ అవ్వరు, దాంతో చేసేదేమీ లేక అసహనానికి లోనవుతుంటారు చాలమంది. అయితే నేటి డిజిటల్ యుగంలో పోయిన ఫోన్ దొరికేలా చేయడం చాలా సులభం పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేని వారు ఉన్నచోటు నుంచే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయవచ్చు. అందుకోసం వేరే మొబైల్ నుంచి 9440627057 కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయాలి.
అలా చేయగానే గూగుల్ పేజి ఉన్న లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే పోయిన తాలూకు మొబైల్ యొక్క ‘ IMEI ‘ నెంబర్స్, పోగొట్టుకున్న వ్యక్తి పేరు, చిరునామా.. తదితర వివరాలు ఎంటర్ చేయాలి. అలా చేసిన తర్వాత కంప్లైంట్ ఒకే చేయాలి. ఇలా చేయగానే సైబర్ క్రైమ్ లో పోయిన పోన్ పై కేసు నమోదు అవుతుంది. ఆ తర్వాత పోలీసులు నిఘా ప్రారంభించి పోయిన ఫోన్ వెతికి పట్టుకొని సదరు వ్యక్తికి అందజేస్తారు. ఇదే ప్రాసెస్ మొబైల్ లోని సైబర్ క్ర్రైమ్ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చు. కాబట్టి ఫోన్ పోయినవారు ఏ మాత్రం నిరుత్సాహనికి గురి కాకుండా పై విధంగా చేస్తే పోన్ తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
Also Read:కవిత అరెస్ట్ వెనకుంది బీజేపీనే!