కళ్లు చూసి గుండెపోటును గుర్తించవచ్చా?

23
- Advertisement -

నేటి రోజుల్లో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు చాలమంది. అయితే గుండెపోటు రావడానికి చాలానే కారణాలు ఉన్నప్పటికి గుండెపోటును త్వరగా గుర్తించకపోవడం వల్లే చాలమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు చెబుతున్నారు నిపుణులు. అందువల్ల గుండెపోటును సూచించే లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించడం ఎంతో మేలు.. సాధారణంగా శరీరంలో వచ్చే కొన్ని మార్పులు గుండెపోటును సూచిస్తాయి. ఛాతీ ఎడమ భాగం నొప్పిగా మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం, తీవ్రంగా చెమటలు పట్టడం, గుండెల్లో మంటగా అనిపించడం, తీవ్రమైన అలసట.. ఇవన్నీ కూడా గుండెపోటుకు సూచనలే.

అయితే వీటన్నిటి కంటే ముందు గుండెపోటు రావడాన్ని కళ్లు సూచిస్తాయట. కళ్ళలో కనిపించే మార్పులు గుండెపోటుకు సంకేతాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కళ్ల చుట్టూ అకస్మాత్తుగా వాపు రావడం, కంటిరంగులో మార్పులు కనిపించడం, దృష్టి లోపం వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి పై లక్షణాలు ఏ మాత్రం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇక గుండెపోటు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకోవడం, ఒత్తిడికి లోనవకుండా ఉండడం, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల గుండెపోటు దరిచేరదు.

Also Read:Harishrao:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

- Advertisement -