గుండెపోటు ఎందుకొస్తుందో తెలుసా?

37
- Advertisement -

నేటి రోజుల్లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అసలు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురౌతున్నారు చాలామంది. గుండెపోటు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. చాలా మంది గుండె పోటు రావడానికి కారణం వాల్వ్ లు బ్లాక్ కావడమే అనుకుంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. మన‌ శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అలాంటి గుండెకు కూడా రక్తం అవసరం అవుతుంది.

ఈ గుండె గోడలకు హృదయ ధమనులు అనే అతి ముఖ్యమైన రక్త నాళాలు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తాయి. మనం తినే ఆహారంలో అధిక క్రొవ్వు పదార్థాలు ఉన్నట్లైతే ఈ కొవ్వు హృదయ ధమనుల్లో క్రమ క్రమంగా పేరుకు పోయి ఒకానొక దశలో గుండె గోడలకు రక్త సరఫరా పాక్షికంగాగానో పూర్తిగా గానో ఆగిపోయినప్పుడు గుండె పోటు వస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో వైద్యులు హృదయ ధమనులు గుండా రక్తం సాఫీగా ప్రవహించడానికి అవసరమైతే స్టెంట్ వేయడం లేకపోతే రక్తం పలుచబడే మందు బిళ్లలు వాడమని చెబుతారు. వాల్వ్ లు బ్లాక్ కావడం వల్ల వచ్చే గుండె పోటు చాలా అరుదుగా జరుగుతుంది.

Also Read:ఆ సినిమాతో వచ్చాయ్…ఈ సినిమాతో పోయాయ్

ఇక గుండె పోటు రాకుండా ఉండాలంటే…

() క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడం

() ప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక వ్యాయామము చేయడం.

() ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం

()ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం

- Advertisement -