మీకు ఓటు ఉందో లేదో తెలుసుకోండిలా!

24
- Advertisement -

ఎలక్షన్స్ ఎంతో దూరంలో లేకపోవడంతో దేశ వ్యాప్తంగా కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఓటు హక్కు ఉన్నవారు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఓటర్ డిటేల్స్ ను అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఓటు హక్కు ఉన్నప్పటికీ చాలమంది ఓటు వేయడానికి దూరంగా ఉంటారు. అలాంటి వారు ఒకవేళ ఓటు వేయాల్సి వచ్చినప్పుడు వారి పేరు ఓటర్ లిస్ట్ లో ఉందో లేదో అనే సందేహం రావడం సహజం. అలాంటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళి ఓటర్ లిస్ట్ లో పేరు ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

* ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అధికారిక వెబ్సైట్ http://electoralsearch.eci.gov.in/ లోకి వెళ్ళాలి.

*అక్కడ search by epic అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి ఎపిక్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

* ఆ తరువాత స్టేట్ యొక్క వివరాలు ఎంటర్ చేసి ఒకే పైన క్లిక్ చేయాలి. ఇలా చేయగానే ఓటర్ యొక్క పూర్తి వివరాలు కనిపిస్తాయి.

( లేదా )

డైరెక్ట్ గా ఓటర్ యొక్క వివరాలు ఎంటర్ చేసి కూడా ఓటర్ లిస్ట్ లో పేరు ను చెక్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం !

* ముందుగా పైన చెప్పబడిన వెబ్సైట్ లోకి వెళ్ళి search by details అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓటర్ యొక్క పేరు, పుట్టిన తేదీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే ఓటర్ లిస్ట్ లో మీ యొక్క పేరు ఉందో లేదో తెలిసిపోతుంది.

Also Read:వేసవిలో చెరుకురసం తాగుతున్నారా?

మొబైల్ ద్వారా కూడా పై విధంగా అనుసరించి ఓటర్ లిస్ట్ లో పేరును చెక్ చేసుకోవచ్చు.

ఇక ఆఫ్ లైన్ లో ఓటర్ లిస్ట్ లో పేరును చెక్ చేసుకునేందుకు గ్రామంలోని బిఎల్ఓ అధికారి వద్దకు వెళ్ళి మీ యొక్క పూర్తి వివరాలు ఇవ్వడం ద్వారా ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో సంబంధిత అధికారి తెలియజేస్తాడు.

ఒకవేళ ఓటర్ లిస్ట్ లో మీ వివరాలు లేని పక్షంలో వెంటనే కొత్తగా దరఖాస్ర్టు చేసుకోవడం మంచిది.

- Advertisement -