తెలంగాణ ఓటరు జాబితాను ప్రకటించిన ఎస్‌ఈసీ..

45
Voter List

తెలంగాణ రాష్ట్రంలో జనవరి 1వ తేదీ నాటికి అర్హులైన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. వీరిలో 1,50,02,227 మంది మహిళా ఓటర్లు, 1,51,61,714 మంది పురుషులు ఉన్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. 1,628 మంది ఇతరులు ఉన్నట్లు స్పష్టంచేసింది. తాజా సవరణలో 2,82,497 మంది ఓటర్లను చేర్చినట్లు, 1,72,255 మందిని తొలగించినట్లు వెల్లడించింది. కొత్తగా 2,82,497 మంది ఓటు నమోదు చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు.