డార్క్ సర్కిల్స్ కు ఇలా చెక్ పెట్టండి!

17
- Advertisement -

నేటి రోజుల్లో చాలామంది డార్క్ సర్కిల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కళ్ల కింద నల్లటి వలయాలు రావడాన్నే డార్క్ సర్కిల్స్ అంటారు. వీటి కారణంగా చాలామంది అందహీనంగా కనిపిస్తూ ఉంటారు. అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే వీటిని పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది. అయినప్పటికి సరైన ఫలితం మాత్రం కనిపించదు. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ప్రధానంగా నిద్రలేమి, పోషకాహార లోపం, ఒత్తిడి, డిప్రెషన్, అతిగా మొబైల్ లేదా టీవి చూడడం,.. ఇలా ఎన్నో కారణాలు కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి కారణం అవుతాయి. .

అయితే వీటిని పోగొట్టుకునేందుకు మెడిసిన్ కంటే కూడా ఇంటి చిట్కాలు అద్బుతంగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో టమాటో అద్బుతంగా పని చేస్తుంది. ఒక స్పూన్ టమాటో రసం అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపి కళ్ళు మూసుకొని డార్క్ సర్కిల్స్ కు అప్లై చేయాలి. ఇలా పది నిముషాలు ఉంచిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. వీటిని తగ్గించడంలో బాదం నూనె కూడా అద్బుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బాదం నూనెలో విటమిన్ ఇ, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ నూనెను రాత్రి పడుకునే ముందు డార్క్ వలయాలకు కొద్దిగా రాసి ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా నారింజ రసం, దోసకాయ, పుదీనా, అలోవెరా వంటివి కూడా డార్క్ సర్కిల్స్ ను దూరం చేయడంలో సహాయ పడతాయి. ఈ చిట్కాలు పాటిస్తూనే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మొబైల్ కు దూరంగా ఉండాలి. సమృద్దిగా నిద్ర పోయేలా మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ను త్వరగా తగ్గించవచ్చు.

Also Read:Kavitha:ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్న రేవంత్

- Advertisement -