ఇదేం నీతి.. రేవంత్ రెడ్డి ?

16
- Advertisement -

గుజరాత్ మోడల్ తో తెలంగాణను పోల్చుతూ ఇటీవల సి‌ఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడి సమక్షంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” గుజరాత్ అద్బుతంగా డెవలప్ అయిందని, గుజరాత్ మోడల్ దేశంలో ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా ఉందని, తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్ అభివృద్ది జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బి‌ఆర్‌ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. గత పదేళ్ళ కే‌సి‌ఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన పురోగతి కళ్ళముందు కనబడుతున్నప్పటికి మోడీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి గుజరాత్ పై పొగడ్తలు కురిపిస్తున్నారని, ఇది ముమ్మాటికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని బి‌ఆర్‌ఎస్ నేతలు మండి పడుతున్నారు.

ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ ట్విట్టర్ వేధికగా సి‌ఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు తెలంగాణ సోయిలేనోడు సి‌ఎం కావడం మన కర్మ అని ” గుల్ మాల్ గుజరాత్ మోడల్ కు గోల్డెన్ తెలంగాణ మోడల్ కు పోలికెక్కడిది అని వ్యాఖ్యానించారు. “ఘనమైన “గంగా జమునా తెహజీబ్ మోడల్” కన్నా.. మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా..?  నిన్నటి దాకా తెలంగాణ మోడల్ పై నిప్పులు చెరిగి ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెప్పడం ఏంటని కే‌టి‌ఆర్ ప్రశ్నించారు.

ఇదేం రీతి ఇదేం నీటి అంటూ సి‌ఎం రేవంత్ రెడ్డిపై కే‌టి‌ఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ళలోనే సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ది సాధించిన తెలంగాణతో గుజరాత్ కు పోలికెక్కడిది అని అన్నారు. దేశం మెచ్చిన తెలంగాణ మోడల్ ను నరేంద్ర మోడి ముందు కించపరిచేలా వ్యాఖ్యానించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని కే‌టి‌ఆర్ ట్విట్టర్ లో ఘాటుగా రాశుకొచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కే‌టి‌ఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

- Advertisement -