ఓటర్ కార్డు కు ఇలా దరఖాస్తు చేసుకోండి!

31
- Advertisement -

ఎన్నికల దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓటరు కార్డు ఉండడం చాలా అవసరం. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకునేందుకు ఓటర్ కార్డు అనేది తప్పనిసరి. అంతే కాకుండా ఆధార్ తర్వాత అన్నీ విధాలుగా కూడా ఓటర్ కార్డు గుర్తింపు కార్డులా ఉపయోగపడుతుంది. అందువల్ల 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవడం తప్పనిసరి. అయితే కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారికి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అందుకోసం ఏ ఏ డాక్యుమెంట్స్ సమర్పించాలి ? ఎక్కడ అప్లై చేయాలి ? అనే విషయాలపై కన్ఫ్యూజన్ కు లోనవుతుంటారు. గతంలో ఓటర్ కార్డు నమోదు కోసం ప్రతి ఊర్లోను కొన్ని ప్రత్యేక సెంటర్లు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా కూడా సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఓటరు కార్డుకు అప్లై చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

* ముందుగా కమ్యూటర్ లేదా మొబైల్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి ఓటర్ల సర్వీస్ అధికారిక వెబ్సైట్ అయిన ( http://voters.eci.gov.in ) అనే వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.

*అక్కడ ఫారమ్స్ (forms) ఆప్షన్ ఎంచుకొని అందులో (fil form 6) పై క్లిక్ చేయాలి. ఆ యొక్క ఫారం ను డౌన్లోడ్ చేసుకొని అందులోని సమాచారాన్ని పూర్తిగా నింపిన తరువాత ఆ యొక్క ఫారం ను మీ సేవ సెంటర్ లో సమర్పించి ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా

* పైన సూచించిన ఓటర్ అధికారిక వెబ్సైట్ లో మొబైల్ నెంబర్ ద్వారా ఇ మెయిల్ ద్వారా రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత మొబైల్ కు వచ్చిన ఓటిపి అక్కడ ఎంటర్ చేసి మన యొక్క పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని పూరించాలి. సమాచారాన్ని పూరించిన తర్వాత అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. ఆ తరువాత దరఖాస్తు రుసుము చెల్లించగానే ఓటర్ కార్డుకు కొత్తగా అప్లై అవుతుంది.

ఓటర్ కార్డు విజవంతంగా అప్లై అయిందో లేదో తెలుసుకునేందుకు అక్కడే అప్లికేషన్ స్టేటస్ కూడా ఉంటుంది. అప్లికేషన్ విజయవంతం అయితే ఓటర్ కార్డు 20 రోజుల్లో పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది. ఇలా సులభంగా ఓటరు కార్డుకు అప్లై చేసుకోవచ్చు.

Also Read:TTD: మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ

- Advertisement -