హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జహీరానగర్‌లో టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఉద్యోగులకు ప్రతీ సందర్భంలో అండగా ఉన్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి బాసటగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. టీఎన్జీవోస్ సీఎం కేసీఆర్ కు బాసటగా ఉండడం సంతోషకరం. ఇది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఉద్యోగులు మా కుటుంబసభ్యులు అన్నారు. ఎన్నికల తర్వాత ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు మంత్రి.
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ.. దశాబ్దాల ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించారు. ఉద్యోగులంటే సీఎం కేసీఆర్ కు ఎనలేని ప్రేమ ఉంది. ఉద్యోగులను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కు మేము ఎల్లప్పుడూ బాసటగా ఉంటామన్నారు మామిళ్ల రాజేందర్.
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ మాట్లాడుతూ.. గత ఆరున్నర ఏడేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.ఎన్నికల సందర్భంగా కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మన కష్టాల్లో తోడున్న టిఆర్ఎస్ కి మనమందరం తోడు ఉందామన్నారు ముజీబ్.