హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో టీ న్యూస్ ప్రప్రథమంగా గోల్డెన్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోకి ప్రవేశం ఉచితం.ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వందల సంఖ్యలో రియల్ ఎస్టేట్ కంపెనీలు సందేహాలను నివృత్తి చేయనున్నాయి.అంతేగాదు ఈ షోని సందర్శించే వారికి గోవాకు ఉచిత ఫ్లైట్ టికెట్లను గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది టీ న్యూస్.
నగరాల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న మధ్యతరగతి జనాభా వల్ల భారత రియల్ ఎస్టేట్ రంగం మరింతగా పుంజుకుంటుంది. అయితే,పెరుగుతున్న పోటీకి అనుగుణంగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీలు వెలుస్తున్నాయి. కొన్ని కంపెనీలు కస్టమర్లకు లాభాల పంటను పండిస్తుంటే మరికొన్ని నట్టేట ముంచేస్తున్నాయి.
ఈ క్రమంలో ఏయే ప్రాంతాల్లో కొత్తగా ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభమైంది? ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అమ్ముడవుతాయి? ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లకు గిరాకీ ఉన్న ప్రాంతాలేవి? ఒక ఏడాదిలో అధిక స్టాకు (ఇండ్లు) అందుబాటులోకి వచ్చిన ప్రాంతమేది? ఇండ్ల సరఫరా తక్కువగా ఉండి.. డిమాండ్ అధికంగా ఉన్న ఏరియాలేవి?ఏ కంపెనీ చేపట్టిన వెంచర్లో ఫ్లాట్ కొనాలి..?అన్న సందేహాలను నివృత్తి చేయడానికి తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ చేపట్టిన ప్రాపర్టీ షో ఉపయోగపడనుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో కొన్నిసంవత్సరాలుగా సేవలందిస్తున్న కంపెనీలు ఈ షోలో పాల్గొననున్నాయి. నగరంలో మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో రియల్ ఎస్టేట్‌కు మరింత గిరాకీ పెరిగింది. దీనికి తోడు ప్రభుత్వం ఐటి రంగం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం చుట్టూ విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నది. ఐటిఐఆర్ టేకాఫ్ అయితే రియల్ డిమాండ్ కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. ఫార్మా సిటీ, ఐటి సెజ్‌లు ఉన్న ప్రాంతాల్లో కొత్త కాలనీల ఏర్పాటుకు, రెసిడెన్షియల్ జోన్ల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు చక్కటి అవగాహన కల్పించేందుకు టీ న్యూస్ నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో అందరికి ఉపయోగపడనుంది.