తన కారు డ్రైవర్‎కి .. చివరి రోజు డ్రైవర్‎గా మారిన కలెక్టర్..

273
TN District Collector Special Treet To Last Day Of His Driver's Job
- Advertisement -

ఎవరైనా తన కింది స్థాయి ఉద్యోగి రిటైర్ అయితో ఏం చేస్తారు మహా అయితే చిన్న పార్టీ అందులో చాయ్, బిస్కెట్, నలుగురి ఉపన్యాసాలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటారు. కానీ తమిళనాడు కరూర్ కలెక్టర్ మాత్రం తన కారు డ్రైవర్‎గా పనిచేసి రిటైర్ అయిన డ్రైవర్‎కు జీవితాంతం గుర్తుండిపోయే ట్రీచ్ ఇచ్చారు. డ్రైవర్ దంపతులను తన కారులో కూర్చోబెట్టుకుని
స్వయంగా డ్రైవర్‎గా మారి వారి ఇంటి వద్ద దింపి వచ్చారు ఆ కలెక్టర్.

35 ఏళ్లపాటు డ్రైవర్‎గా సేవలిందించి రిటైర్ అవుతున్న డ్రైవర్ పరమశివమ్‎కి కొత్తగా ఏదైనా గుర్తిండి పోయేలా చేయాలనుకున్నారు కలెక్టర్ టి. అంబళగన్. నాకు డ్రైవర్‎గా ఇన్నేళ్లు సేవలందించిన తనకు ఆ ఒక రోజు డ్రైవర్ మారాలనుకున్నాడు. ఫేర్‎వెల్ పార్టీ ముగిశాక డ్రైవర్ దంపతులను తీసుకెళ్లిన కలెక్టర్ స్వయంగా తానే డోర్ తెరిచి ఆ దంపతులను కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర వారిని దిగబెట్టి వాళ్ల ఇంట్లో టీ తాగి వచ్చారు.

35 ఏళ్లు డ్రైవర్‎గా పనిచేసిన పరమశివమ్‎కు కలెక్టర్ సరైన గుర్తుంపు ఇచ్చారని చూసిన వారందరూ ప్రశంసిస్తున్నారు. కలెక్టర్ టి.అంబళగన్ ఇంతకు ముందు కూడా ఓ వృద్ధిరాలి ఇంటికి వెళ్లి ఆమె పడుతున్న కష్టాలు తెలుసుకుని, ఆమెకు ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని వడ్డించారు. ఆ తర్వాత ఆమెకు నెలకు. రూ.10 వేలు ఫించను వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -