పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘దీదీకే వచన్’ పేరుతో 10 కీలక హామీలను ప్రకటిస్తూ మరోసారి ప్రజల మద్దతు కోరారు.
ఈ మేనిఫెస్టోలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కీలక వాగ్దానాలు చేశారు:
నిరుద్యోగులకు, సాధారణ మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం
ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,700 చొప్పున సహాయం
ప్రజల గడప వద్దకే నాణ్యమైన వైద్య సేవలు అందించడం
ప్రతి కుటుంబానికి శాశ్వత గృహం కల్పించడం
ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీరు అందించడం
Also Read:రవీంద్ర తేజ్.. ‘లవ్‌వాలా’
ఈ హామీలు రాష్ట్రంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయని టీఎంసీ పేర్కొంది.
మమతా బెనర్జీ ఈసారి భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ తరపున సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. మరోవైపు నాలుగోసారి అధికారంపై మమత ధీమా వ్యక్తం చేయగా ప్రజల సంక్షేమ పథకాలే తమకు తిరిగి విజయాన్ని అందిస్తాయని ఆమె తెలిపారు.

