జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డిను బుజ్జగించేందుకు మంత్రులు ఆయన నివాసానికి చేరుకున్నప్పటికీ, చర్చలు ఫలించలేదని సమాచారం.
మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డిని కలిసి పార్టీ పరిస్థితులపై చర్చించారు.
అయితే, మంత్రుల బుజ్జగింపులను జీవన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇటీవల హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్తో జరగాల్సిన భేటీకి జీవన్ రెడ్డి గైర్హాజరు కావడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మంత్రులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడినట్లు తెలుస్తోంది.
Also Read:Shreyas:ఈసారి ట్రోఫీ మాదే!
ఇక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

