ట్రంప్ సంచలన నిర్ణయం..

18
- Advertisement -

అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ఊరటనిచ్చేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.    ఇరాన్ చమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు ఇరాన్ చమురు ఎగుమతులకు మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెంచడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు.

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ నుంచి చమురు సరఫరా మళ్లీ ప్రారంభమైతే, గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఊరట లభించనుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించవచ్చు.

అయితే, ఈ మినహాయింపు కేవలం 30 రోజులకే పరిమితం కావడంతో, దీని తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. అవసరాన్ని బట్టి ఈ గడువును పొడిగించే అవకాశాన్ని కూడా అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Also Read:Shreyas:ఈసారి ట్రోఫీ మాదే!

- Advertisement -