మమతాకు మరో షాక్..ఎంపీ రాజీనామా

2
- Advertisement -

ఇండియా కూటమి సమావేశం వేళ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి  గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ సీనియర్ నేత,రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ సోమవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మెజారిటీ టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

గత కొద్దిరోజులుగా బెంగాల్ అధికార పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం నడుస్తోంది. అసెంబ్లీ వేదికగా మొదలైన ఈ తిరుగుబాటు త్వరలోనే పార్లమెంట్‌కు కూడా పాకుతుందని సుఖేందు శేఖర్ రాయ్ ఇటీవలే బహిరంగంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడంతో మమతా బెనర్జీకి జాతీయ స్థాయిలో ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

Also Read:‘పెద్ది’ నాలుగో రోజు కలెక్షన్స్!

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, ఎమ్మెల్యేల అసంతృప్తిని నాయకత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుఖేందు శేఖర్ రాయ్ వంటి సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ తప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్‌ను మరింత ఆత్మరక్షణలోకి నెట్టింది. రాబోయే రోజుల్లో ఈ తిరుగుబాటు ఇంకా ఎంతమంది ఎంపీలను ప్రభావితం చేస్తుందోనని టీఎంసీ అధిష్టానం ఆందోళన చెందుతోంది.

- Advertisement -