టాలీవుడ్ నటుడు, ఛత్రపతి సినిమా విలన్ (కాట్రాజ్)గా గుర్తింపు తెచ్చుకున్న సుప్రీత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఆయన దాడికి పాల్పడినట్లు మేడ్చల్ జిల్లా నాగారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
క్యాబ్ డ్రైవర్ నాగారం పరిసర ప్రాంతంలో బుకింగ్ కోసం రోడ్డు పక్కన తన కారును నిలిపి ఉంచి ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన నటుడు సుప్రీత్ రెడ్డి.. తన కారు వెళ్లడానికి అడ్డంగా ఉన్నావంటూ సదరు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.
Also Read:ఇరాన్-ఇజ్రాయెల్..బాంబుల మోత!
మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సుప్రీత్ రెడ్డి… డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి చితకబాదారని బాధితుడు ఆరోపించాడు. ఘటన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన క్యాబ్ డ్రైవర్ వెంటనే స్థానిక నాగారం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి నటుడు సుప్రీత్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

