దీదీకి షాకిస్తున్న నందిగ్రామ్‌..!

226
mamatha
- Advertisement -

బెంగాల్ ఎన్నికల సంగ్రామం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. సీఎం మమతా ప్రధానంగా మోదీ,బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుండగా మరోవైపు నందిగ్రామ్‌లో సొంతపార్టీ నేతల నుండే వ్యతిరేకత వస్తోంది. దీదీకి వ్యతిరేకంగా బహిరంగంగా బీజేపీ నేతలకు మదత్తిస్తున్నారు తృణమూల్ నేతలు.

నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పేరు తొలగించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. ఆయనకు శాశ్వత నివాసం లేదని, గత ఆరు నెలలుగా స్థానికంగా ఉండటం లేదని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయగా తప్పుడు వివరాలు ఇచ్చినందుకు సువేందుపై క్రిమినల్ చర్యలు ‌తీసుకోవాలని ఈసీని కోరింది.

అయితే మరోవైపు టీఎంసీ ఎంపీ శిశిర్‌ అధికారి…. తన కుమారుడు సువేందు అధికారికే ఎన్నికల్లో మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…ఆహ్వానిస్తే బీజేపీలో చేరుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో దీదీకి గట్టి షాక్ తగిలింది.

- Advertisement -