- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుండగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న 59,090 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 22,593 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా ఆదాయం రూ. 4.03 కోట్లు వచ్చిందని తెలిపారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి 28 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 20న ధ్వజారోహణం, 24న గరుడసేవ, 27న రథోత్సవం, 28న చక్రస్నానం, మార్చి 1న పుష్పయాగం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -