నాని…’దసరా’ హార్ట్ బ్రేక్ సాంగ్‌

13
- Advertisement -

సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో తెరకెక్కుతున్న నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుండగా కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన ధూమ్ ధామ్ సాంగ్‌‌, టీజర్‌‌‌‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెకెండ్ సాంగ్‌‌ రిలీజ్ డేట్‌‌ను గురువారం అనౌన్స్ చేశారు. వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందుగా, అంటే ఫిబ్రవరి 13న ‘ఓరి వారి’ అనే హార్ట్‌‌బ్రేక్ ఆంథమ్‌‌ని విడుదల చేయనున్నట్టు చెప్పారు. మళ్లీ మళ్లీ వినేలా ఈ పాట ఉంటుందని ట్వీట్ చేశాడు నాని.

పాత సైకిల్, పగిలిపోయిన కూలింగ్‌‌ గ్లాసెస్‌‌, టేప్‌‌ రికార్డర్‌‌‌‌, గాజు సీసాలు తగులుతున్న సౌండ్, వెలుగుతున్న లాంతర్లతో విడుదల చేసిన ప్రోమో వీడియో ఆకట్టుకుంది. మార్చి 30న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -