అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ

21
- Advertisement -

అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంత‌రం మూలవిరాట్‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు,  ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి,  ఆండాళ్ అమ్మవారికి, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వార్‌కు,  ఆంజ‌నేయ‌స్వామివారికి, ధ్వ‌జ‌స్థంభం, ఇత‌ర ప‌రివార‌ దేవ‌త‌ల‌కు ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

Also Read:Jr NTR:దేవర స్టోరీ లైన్ అదేనా?

- Advertisement -