బాబోయ్ ఎండలు..జాగ్రత్త!

29
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండి పోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రత్తలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ముందు రోజుల్లో ఈ ఉష్ణోగ్రత్తల స్థాయి మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే వడదెబ్బ, డిహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడి ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం !

* వేసవిలో బయటి ఉష్ణోగ్రతలతో పాటు శరీర ఉష్ణోగ్రత్త కూడా గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. కాబట్టి బాడీలో నీటి శాతం సమతుల్యంగా ఉంచుకునేందుకు రోజుకు కనీసం 6-7 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

* వేసవిలో వచ్చే వడగాలుల కారణంగా త్వరగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. తలపై టోపీ దరించాలి ఇంకా చెవుల్లోకి వడగాలి వెళ్లకుండా బట్ట కట్టుకోవడం చేయాలి. అలాగే గొడుగు, వాటర్ బాటిల్ వంటివి వెంట తీసుకెళ్ళడం మరీ మంచిది.

* వేసవిలో దరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కాటన్ దుస్తులు ధరించడం మంచిది ఎందుకంటే శరీరం నుంచి వచ్చే చెమట, ద్రవాలను కాటన్ దుస్తులు త్వరగా సోసించుకుంటాయి. అందువల్ల అలర్జీ వంటివి దరిచేరవు.

* తినే ఆహారం విషయంలోను తాగే పానీయాలా విషయంలోనూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో ప్రతిరోజూ రాగిజావా తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే రాగిజావలోని పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇంకా మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు తరచూ సేవిస్తూ ఉండాలి.

*ఈ వేసవిలో రోజుకు రెండు సార్లు స్నానం, చేయడం ఎంతో మంచిది. ఎందుకంటే ఎండల కారణంగా శరీరం నుంచి విడుదలయ్యే చెమట కారణంగా దుర్వాసన, అలెర్జీ, దద్దుర్లు, చెమట కాయలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. వీటి నుంచి బయట పడేందుకు ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేస్తూ బాడీ లోషన్స్, సన్ క్రీం వంటివి శరీరానికి అప్లై చేయాలి.

* అన్నిటికంటే ముఖ్యం అత్యవసర సమయాల్లో తప్పా అనసవరంగా బయట తిరగరాడు. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also Read:TTD: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

- Advertisement -