ఏపీలో ‘పెన్షన్ గోల’..!

21
- Advertisement -

ఏపీలో ప్రతి నెల 1వ తారీఖు రాగానే వాలంటీర్ల ద్వారా పెన్షన్ నేరుగా లబ్దిదారులకు అందేది కానీ ఈ నెల మాత్రం పెన్షన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంచడాన్ని ఈసీ నిరాకరించింది. దీంతో ఒకటో తేదీనా అందవలసిన పెన్షన్ అందకపోవడంతో రాజకీయ వేడి రాజుకుంది. అయితే వాలెంటర్లు పెన్షన్ ఇవ్వడంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో కలిసి చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారని, వాలెంటరీ వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పెన్షన్ పెండింగ్ లో పడడానికి ప్రధాన కారణం చంద్రబాబే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే దీనిపై టీడీపీ వాదన మరోలా వుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు ఎలాంటి కార్యక్రమలలో పాల్గొనరాదని ఈసీ గతంలోనే స్పష్టం చేసింది. అయినప్పటికి వాలంటీర్ల ద్వారా వైసీపీ ఇంటింటి ప్రచారం చేయిస్తోందని, పెన్షన్ ఇచ్చే క్రమంలో లబ్దిదారులను ప్రభావితం చేసేలా వాలంటీర్ల ద్వారా జగన్ ప్రేరేపిస్తున్నారాన్ని టీడీపీ విమర్శిస్తోంది. ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్ ఉల్లంఘన అయినందుకే వాలెంటర్లు పెన్షన్ పంచడంపై ఈసీ ఆంక్షలు విధించిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇలా పెన్షన్ విషయంలో టీడీపీ, వైసీపీ మద్య రాజకీయ రగడ కొనసాగుతోంది.

అయితే 1వ తేదీన ఇవ్వవలసిన పెన్షన్ 3 వ తేదీలోపు ఇచ్చే విధంగా జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది, అంతే కాకుండా వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది లేదా వీఆర్వోల ద్వారా పెన్షన్ పంపిణీ చేపట్టే విధంగా జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోందట. మొత్తానికి ఎన్నికల ముందు వాలెంటిర్ల అంశం వైసీపీకి కొంతమేర ఇబ్బందిని కలిగిస్తోందనే చెప్పవచ్చు. ఇప్పటికే వాలెంటిర్లను ఎన్నికల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వారు చేసే విధుల విషయంలో కూడా ఆంక్షలు విధిస్తూండడంతో ఈ పరిణామాలు వైసీపీకి కొంత ఇబ్బందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read:TTD: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

- Advertisement -