ఈ లక్షణాలున్నాయా..అయితే జాగ్రత్త!

2
- Advertisement -

నీరు శరీరాన్ని డీ హైడ్రేడ్ కాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. బయట ఉండే విపరీతమైన ఎండ కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి దాహం వేస్తుంటుంది. అయితే సాధారణంగా ఒక రోజుకి 4-5 లీటర్ల నీరు తగాల్సి ఉంటుంది. అప్పుడే మన శరీరంలో నీరు సమతుల్యంగా ఉంటుంది. ఇక వేసవిలో నీరు కాస్త ఎక్కువే తాగాలి ఎందుకంటే ఎండ కారణంగా మన బాడీలోని నీటి శాతం త్వరగా తగ్గిపోతుంటుంది.

మనం తీసుకున్న నీటి కన్నా ఎక్కువ ఫ్లూయిడ్​ లాస్​ అయితే శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతిని డీహైడ్రేషన్​కు దారితీస్తుంది. ఫ్లూయిడ్​ లెవెల్స్​లో స్వల్పంగా తగ్గుదల ఉన్నా- తలనొప్పి, బద్ధకం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా చర్మం ఆరోగ్యంగా ఉండాలన్న, చెమట వాసన రాకుండా ఉండాలన్న, ఇన్ఫెక్షన్లను నివారించాలన్న తగినన్ని నీరు తాగడం తప్పనిసరి. మలబద్దకాన్ని నివారించాలన్న శరీరంలో తగినంత నీటి స్థాయి ఉండటం మంచిది. దాహం వేయడం, తర్వాతి ఫ్లూయిడ్ ఇన్​టేక్​​- హైడ్రేషన్​ స్థాయిలతో సమానంగా ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి.

పరిశోధనలో భాగంగా ఉదయం, మధ్యాహ్నం కొంతమంది మూత్రం, రక్తం, శరీర బరువు శాంపిల్స్​ ఇచ్చారు. వీటిని పరిశీలించి చూస్తే- ఉదయం దాహం స్థాయిలు, మధ్యాహ్నం హైడ్రేషన్ స్టేటస్ మధ్య తక్కువ సంబంధం ఉందని తేలింది. హైడ్రేషన్​ స్టేటస్​తో సంబంధం లేకుండా పురుషుల కంటే మహిళలలే ఎక్కువగా దాహంగా ఉన్నట్లు ఫీల్ అయ్యారని ఈ పరిశోధనలు తేల్చింది.

మన శరీరం డీహైడ్రేడ్‌గా ఉందని ఈ విధంగా తెలుసుకోవచ్చు. మూత్రం రంగు పేల్​ ఎల్లో కలర్​లో ఉండటం మంచి హైడ్రేషన్​ స్థాయిలను సూచిస్తుంది. అదే ముదురు ఎల్లో, కాన్​సెన్​ట్రేడెట్ యూరిన్​ ఉంటే డీహైడ్రేషన్​ ఉందని అర్థం. రోజు క్రమం తప్పకుండా రోజుకు 4 నుంచి 6 సార్లు మూత్ర విసర్జన చేస్తే శరీరం హైడ్రేడెట్​గా​ ఉన్నట్లు. క్రమం తప్పితే డీహైడ్రేషన్​ను సూచిస్తుంది. నోరు, పెదవులు పొడ బారడం ,తలనొప్పి, అలసట,చెమట పట్టడం వంటి లక్షణాలుంటే శరీరం డీహైడ్రేషన్​కు గురవుతుంది.

- Advertisement -