సుకుమార్ ప్లాన్స్ చెడగొట్టిన కరోనా..!

194
sukumar
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకుడు సుకుమార్‌ అల్లు అర్జున్‌ హీరోగా పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ. గత కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా నుంచి బన్నీ ఫస్ట్‌ లుక్‌ విడుదలైన వైరల్‌గా మారింది.

అయితే ఈ చిత్రంలో కీలకంగా ఉండే పుష్పరాజు ఎంట్రీ సాంగ్‌ మొదట షూట్‌ చేయాలని సుకుమార్‌ ఫిక్స్‌ అయ్యాడట. అంతేకాకుండా శేషాచలం అడవుల్లో హీరోపై కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించాలని ప్లాన్‌ చేశాడు. దీనికోసం హైద్రాబాద్‌లోనే అడవి సేట్ కూడా వేయబోతున్నట్లు సమాచారం.

ఇక అసలు విషయానికొస్తే.. కరోనా ప్రభావంతో ఎక్కువమందితో షూట్‌ చేయాలనుకుంటే ఇప్పడే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాను అనుకున్నట్లుగా సినిమా తీయడమెలా అనే ఆలోచనలో పడినట్లు టాక్‌. మరి సుకుమార్‌ పరిమిత స్థాయి సిబ్బందితో సినిమా పూర్తి చేస్తాడా..? పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తాను భావిస్తున్నట్టుగా సినిమా పూర్తి చేస్తాడా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.

- Advertisement -