ముగ్గురు సీఎంల జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌

51
- Advertisement -

ఆప్ ఢిల్లీ పంజాబ్ ఆప్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ మాన్ సింగ్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లారు. వారి వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి ఉన్నారు. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం కేసీఆర్‌తో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం మూడు గంటలకు ప్రగతి భవన్‌లో జనహితలో ముగ్గురు సీఎంలు కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్, జీవన్ రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రెస్‌ మీట్‌లో ప్రజలకు వివరించనున్నారు.

Also Read: మోడీజీ 9 ఏళ్ళు, 9 సవాళ్ళు.. సమాధానం ఉందా?

- Advertisement -