వైరలవుతున్న ఆలనాటి జ్ఞాపకం కానీ…

197
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభాలాంటి వ్యక్తులు స్వర్గస్తులైన వారి నుంచి నటవారసత్వంను పుణికిపుచ్చుకొని తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్ కృష్ణ మరణంతో సినీ లోకమంతా దిగ్బ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. నాటి తరం హీరోలలో తెలుగు సినిమాను తెలుగు ప్రజలకు చేరవేసేందుకు అహర్నిశలు కష్టపడ్డా నాటి కృష్ణ ఏఎన్నాఆర్ ఎన్టీఆర్‌ కలిసి ఉన్న ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది.

తెలుగు పరిశ్రమను మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు కృషి చేసిన వారిలో ఎన్టీఆర్ ఏఎన్నాఆర్ ఎన్టీఆర్ కృష్ణంరాజు శోభన్‌బాబు. వారి తరం నుంచి చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున మూడోతరం వచ్చే నాటికి అంటే ప్రస్తుతం మూలస్తంభాలగా మారి పాన్‌ ఇండియా సినిమాలు తీస్తూ తెలుగు జాతిని ప్రపంచమంతటా విస్తరిస్తుంది.

ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ కలిసి దిగిన ఫోటోకి.. ఇప్పుడు మహేష్, చైతూ, తారక్ కలిసి ఉన్న ఫోటోని జోడిస్తూ నెటిజన్లు ఓ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. రెండు తరాలు ఒకే ఫ్రేములో కనిపించినప్పటికీ.. ఈ కలయిక కృష్ణ మరణం సందర్భంగా చోటు చేసుకోవడం బాధాకరమని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అలానే మహేశ్ బాబు – ప్రభాస్ – అఖిల్ అక్కినేని కలిసి ఉన్న ఓ ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. నందమూరి – అక్కినేని – సూపర్ స్టార్ – రెబల్ స్టార్ ఫ్యామిలీలు ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా రాణిస్తున్నారు. అలనాటి నటులు ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ – కృష్ణంరాజు కాలం చేసినా.. వారి లెగసీని మహేష్ బాబు – చైతన్య – అఖిల్ – తారక్ – ప్రభాస్ కొనసాగిస్తారని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ 1996 జనవరి 18న తన 72వ ఏట కన్నుమూసారు. 2008 మార్చి 20న శోభన్‌బాబు మరణించారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న తన 90వ తుదిశ్వాస విడిచారు. రీసెంట్‌గా సెప్టెంబర్ 11న కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కృష్ణ నవంబర్‌ 15న2022 మరణంతో…మొత్తంగా దిగ్గజ నటులు అంతా భువి నుండి దిగికెగియడం తెలుగు కళామతల్లికి తీరని లోటు.

ఇవి కూడా చదవండి..

టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న ప్రపంచ సుందరీ

వామ్మో బాలయ్య.. ఇన్ని ఫైట్లా ?

పాన్ ఇండియా హీరోలు..ఇదేం పని ?

- Advertisement -