- Advertisement -
ఇప్పటికే ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం లాగా వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరులో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ తరుణంలో వాతావరణశాఖ హెచ్చరిక ప్రజలను కలవరపెడుతోంది.
- Advertisement -