మహాసముద్రంలోకి అను!

184
anu immanuel

ఒక్కో అనౌన్స్‌మెంట్‌తో ‘మ‌హాస‌ముద్రం’ చిత్రం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుకుంటూ వ‌స్తోంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమాని ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్నారు.లేటెస్ట్‌గా ఈ ఫిల్మ్‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.

చిత్రంలో ఓ క‌థానాయిక‌గా అదితి రావు హైద‌రిని ఎంపిక చేయగా మ‌రో క‌థానాయిక‌గా అను ఎమ్మాన్యుయేల్‌ని ఎంపిక చేసిన‌ట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. ప్ర‌తి పాత్ర‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉండేలా అజ‌య్ భూప‌తి స్క్రిప్ట్ రాసుకున్నార‌ని, రెండో హీరోయిన్‌గా అను ఎమ్మాన్యుయేల్ బాగుంటుంద‌ని ఈమెని ఎంపిక చేశామ‌ని డిసెంబ‌ర్ నుండి చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుందని వెల్లడించారు. ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా అయిన ‘మ‌హాస‌ముద్రం’ను ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: అజ‌య్ భూప‌తి
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
బ్యాన‌ర్‌: ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌