బీఆర్ఎస్ నేతలకు బెదిరింపులు..వదిలిపెట్టం

3
- Advertisement -

ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనచారి. మీడియాతో మాట్లాడిన ఆయన..పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాం అన్నారు. ఫోన్లు చేసి బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలి…శంబీపూర్ రాజు ఉద్యమంలో కీలకంగా పని చేశారు అన్నారు.

రాజు వెంట 60 లక్షల బీ ఆర్ ఎస్ సైన్యం ఉంది.. లోతైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి అన్నారు. మైనంపల్లి హన్మంతరావు బజారు రౌడీ లా వ్యవహరిస్తున్నారు… గుండల్లాగ బెదిస్తున్నారు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యక్తులపై దృష్టి పెట్టీ శిక్షించాలి అన్నారు.

మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కుమార్ ఇద్దరు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజ్ కు ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారు అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. రోడ్డు మీద 300 వాహనాలతో ట్రాఫిక్ చేసి న్యూసెన్స్ చేసారు… బూతులు మాట్లాడుతున్న వారిపైన కేసులు పెట్టడం లేదు..తెలంగాణ గుండాల పాలయ్యింది అన్నారు. వీళ్ళు బెదిరిస్తున్న పట్టించుకోవడం లేదు.. మైనంపల్లి గుండాగిరి రాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు అన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి గుండా యాక్ట్, పీడి యాక్ట్ కేసులు పెట్టాలి..డీజీపీ వీటిపైన దృష్టి పెట్టాలి అన్నారు. రాబోయే రోజుల్లో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళను వదిలిపెట్టం…. ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు.

Also Read:పద్మ అవార్డుల గడువు పెంపు..

- Advertisement -