- Advertisement -
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ తగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాంపురం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేపట్టడంలేదని నిలదీశారు ప్రజలు.
వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గార్ల మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను మున్నేరువాగు పై అడ్డుకున్నారు ప్రజలు.
బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో పాటు కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం ఉద్యమాలు చేస్తా అని చెప్పి వెళ్ళిపోయారు కనకయ్య. బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు గ్రామస్థులు.
Also Read:బీఆర్ఎస్ పార్టీకి సింపతి ఉంది:ఫిరోజ్ ఖాన్
- Advertisement -

