బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫేస్బుక్ ఖాతా నుంచి బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు సల్మాన్‌ఖాన్ భద్రతను సమీక్షించారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జైలులో ఉన్నాడు. మీరు కోరుకున్న ఏ దేశానికైనా పారిపోండి, లేకపోతే చావు ఖాయం’ అని హెచ్చరించాడు. అసలు సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు. చాలా సార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి వాటిని తాను సీరియస్ గా తీసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఐతే, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ముంబైలోనే చంపేస్తామని గతంలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఇలాంటి బెదిరింపులు వచ్చిన ప్రతిసారి సల్మాన్ ఖాన్ కు పోలీసులు భారీ బందో బస్త్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, ఆన్-గ్రౌండ్ ఈవెంట్లకు దూరంగా ఉండాలని సల్మాన్ ను పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మొత్తమ్మీద ఈ బాలీవుడ్ స్టార్ హీరోకి బెదిరింపులు రావడం కామన్ అయిపోయింది. అన్నట్టు గతంలో ఓ ముఠా సల్మాన్ ఖాన్ ను చంపడానికి స్కెచ్ కూడా వేసింది అని రుజువు అయ్యింది.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. అసలు ఇలాంటి మాటలతో సల్మాన్ ను ఎన్నిసార్లు చంపేస్తారు ? అంటూ బాధ పడుతున్నారు. సల్మాన్ భాయ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో మూవీని తెరకేకించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా 2024 ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకు సూటబుల్ గా “ది బుల్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా 1988 లో మాల్దీవ్స్ టెర్రరిస్ట్ అటాక్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను విష్ణువర్ధన్ డైరెక్ట్ చేస్తున్నారు.
Also Read:స్కాంగ్రెస్.. ‘డమ్మీ సర్వేల’ బాగోతం!