ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం..

65
- Advertisement -

ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభమైంది. గుంటూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

ఆటో‌నగర్ వద్ద ఏఎస్ కన్వెన్షన్ హాల్ వెనుక భాగంలో అయిదంతస్తులతో కార్యాలయన్ని నిర్మించారు. పార్టీ సమావేశాల నిర్వహణకు రెండు ఫ్లోర్లు కేటాయించారు. అతిథులు కూర్చొనే విధంగా పెద్దహాలు ఏర్పాటు చేశారు. ఇక, ఐదో అంతస్తులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఉంటుంది.

Also Read:Ram Charan: ది గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్..

ఇప్పటికే ఏపీ నుండి పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

Also Read:అంతర్జాతీయ టీ దినోత్సవం..

- Advertisement -