బత్తాయి రసంతో ఆ సమస్యలు దూరం.. !

41
- Advertisement -

వేసవి కాలం ముగిసిపోయిన ఇంకా ఎండలు భగ్గుమంటూనే ఉన్నాయి. ఈ సూర్యతాపానికి తట్టుకోలేక చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటారు. దీంతో డీహైడ్రేషన్ నుంచి తప్పించుకునేందుకు పండ్ల రసాలు, మంచి నీరు, మజ్జిగ వంటివి అధికంగా సేవిస్తూ ఉంటారు. అయితే డీహైడ్రేషన్ ను తగ్గించడంలో బత్తాయి రసం చాలా బాగా ఉపయోగ పడుతుంది. బత్తాయి రసం తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గడంతో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చూడడానికి నిమ్మపండును పోలి ఉండే బత్తాయి రుచిలో కాస్త పులుపు తీపి కలగలిపి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, జింక్, కాపర్, ఐరన్ వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి.

కాబట్టి ఇవన్నీ శరీరానికి కావలసిన శక్తిని అందించడంతో పాటు రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. బత్తాయిలో ఉండే ఆమ్లాలు శరీరంలో పెరుకుపోయిన టాక్సీన్లను బయటకు పంపిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఒక గ్లాస్ బత్తాయి రసం తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బత్తాయిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి మలబద్దకం వంటి సమస్యలకు చెక్ పడుతుంది. ఇక బత్తాయిలో పొటాషియం, కాపర్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి మూత్రపిండాలు మరియు మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తాయి.

Also Read: వండిన కూరగాయలు..ఎంతసేపట్లో జీర్ణం అవుతాయో తెలుసా?

తరచూ నీరసం, అలసట వంటి సమస్యలకు గురైయ్యే వారు బత్తాయి రసం తాగితే వెంటనే శరీరం రీఫ్రెష్ మోడ్ లోకి వచ్చి ఫుల్ యాక్టివ్ గా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ రోగులకు బత్తాయి రసం ఒక ఔషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రెండు స్పూన్ల బత్తాయి రసానికి, కొద్దిగా ఉసిరి రసం తేనె కలిపి తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుందట. ముఖ్యంగా గర్బిణి స్త్రీలు బత్తాయి రసం తాగితే ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుట్టబోయే బిడ్డకు కూడా సమృద్దిగా అంది. శిశువు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా వివిధ రకాల కళ్ల సమస్యలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు, యూరినరీ సమస్యలు దూరం చేయడంలో బత్తాయి రసం ఎంతో ప్రయోజనాకారి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు వీలైతే ఒక గ్లాస్ బత్తాయి రసం తాగాలని నిపుణుల సూచన.

Also Read: ఇవి తింటే మతిమరుపు మాయం.. !

- Advertisement -