ఏజెన్సీలోని బీసీలకు సంక్షేమ ఫలాలు అందాలి

30
- Advertisement -

తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలల్లో నివాసముంటున్న బీసీ వర్గాల్లోని సంచార, అర్థసంచార, విముక్త కులాలు, జాతుల అభ్యున్నతికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు, నిర్మాణాత్మకంగా, నిర్దిష్టంగా సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సినీ నటుడు సుమన్ ఆధ్వర్యంలోని ప్రతి నిధి బృందం రాష్ట్ర బీసీ కమీషన్‌తో భేటీ అయ్యారు. ఖైరతాబాద్‌లోని బీసీ కమీషన్‌ కార్యాలయంలోని ఛైర్మన్‌ డాక్టర్ వకుళాభరణం ఛాంబర్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్‌ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సీహెచ్‌ ఉపేంద్ర, కే.కిశోర్‌గౌడ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీసీ వర్గాలకు ఎంతగానో చేయూతను ఇస్తున్నట్టు తెలిపారు. కాగా ఏజెన్సీ ప్రాంతాలలో నివాసముంటున్న విముక్త, సంచార, అర్థ సంచార కులాలు, జాతుల ప్రజలకు చైతన్య రహితం కారణంగా వాటిని పూర్తిస్థాయిలో సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్నట్టు వివరించారు. వారి జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి మెరుగైన మార్గాలను వెతకాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్‌ కార్డు, ఆధార్ కార్డు లాంటి ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. ప్రధానంగా బీసీ జాబితాలోని ఏ-గ్రూప్‌లో గల కులాలు, వర్గాల నిమిత్తం ప్రత్యేక అధ్యయనం నిర్వహించి వారి జీవితాలలో ప్రభుత్వం వెలుగులు నింపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని…దానికి అనుగుణంగా బీసీ కమీషన్ సిఫారసులు ఉండాలని కోరారు.

Also Read: VinodKumar:అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు..

- Advertisement -