అందరి కళ్ళు వీరయ్య మీదే

205
- Advertisement -

వచ్చే సంక్రాంతికి మాస్ సినిమాలతో చిరు, బాలయ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ తో చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య’ తో పోటీలో నిలిచారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకున్నాయి. రిలీజ్ కి ఇంకా కొన్ని రోజులే ఉండటంతో షూటింగ్స్ తో యూనిట్స్ పరుగులు పెడుతున్నారు.

అయితే సంక్రాంతి రాబోతున్న ఈ రెండు సినిమాల్లో ముందుగా బాలయ్య థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా వీర సింహా రెడ్డి’ రిలీజ్ డేట్ అఫీషియల్ గా చెప్పేశారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. అయితే వాల్తేరు వీరయ్య కి సంబంధించి ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఈ సినిమా జనవరి 13న రానుందని టాక్ వినిపిస్తోంది. కానీ మేకర్స్ నుండి ఇంకా క్లారిటీ లేదు.

దీంతో బాలయ్య చెప్పేశాడు వీరయ్య ఎప్పుడు రిలీజ్ డేట్ చెప్తాడో అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్యకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతుంది. వచ్చే వారం యూనిట్ సాంగ్ షూట్ కోసం అప్రోడ్ వెళ్లనుంది. మరో రెండు రోజుల్లో వీరయ్య రిలీజ్ డేట్ కూడా చెప్పే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

తారక్ సినిమా కోసమే పుట్టాడు:జక్కన్న

బాలయ్యతో ప్రభాస్ ?

వివాదాలకు కేరాఫ్ నోరా ఫతేహి…

- Advertisement -