టికెట్ టు ఫినాలే విజేత..శ్రీహాన్

472
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 91 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచి ఫైనల్‌లో అడుగుపెట్టారు శ్రీహాన్.

తొలుత అదిరే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగార్జున. తర్వాత రేవంత్ తండ్రైన విషయాన్ని కన్ఫెషన్ రూంకి పిలిచి చెప్పారు బిగ్ బాస్. ఆ మాట వినగానే.. నాకు లక్ష్మీ దేవి పుట్టింది బిగ్ బాస్ సో హ్యాపీ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పడంతో రేవంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తర్వాత టాస్క్‌కి ఆదిరెడ్డి సంచాలక్‌గా వ్యవహరించగా రేవంత్ ఓటమిని తట్టుకోలేకపోయారు. రేవంత్ ప్రవర్తన చూసి అతడి కళ్లు తెరపించారు నాగ్. భగవద్గీత తెలుసు కదా.. ప్రయత్నం మాత్రమే నీది.. ఫలితం ఆశించకు.. నువ్ ప్రయత్నం ఆపేస్తే.. ఫలితం మారిపోతుంది కదా అని షాక్ ఇచ్చారు. మొత్తానికి శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలుపొందటంతో హౌస్‌లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -