ప్రస్తుతం ఉన్న రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బు ఉండాలి లేదా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏది ఉన్నా రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టంగా చెప్పుకోవచ్చు.. కానీ ఒడిశా లో వ్యక్తి ఇందుకు భిన్నంగా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఈయన్ను ఒడిశా మోదీ అని పిలుస్తారు. ప్రధాని మోదీ ఎప్పుడు ఒడిశాకు వచ్చినా ఈయన్ను కలిశే వెళ్తారు. అతనికి ఇల్లు కూడా లేదు. ఒక పూరీ గుడిసెలో ఉంటాడు. అతని భుజానికి ఓ సంచీ, కాళ్లకు ఆకుచెప్పులు , ఆయన ఎప్పుడు చూసినా అలాగే కనిపిస్తాడు. ఓ సైకిల్‌పై తిరుగుతూ చిన్న పిల్లలతో ఆడుతూ మారుమూల తండాలకు కాలినడక వెళ్తుంటాడు. స్టేట్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ కనిపిస్తాడు. ఎవరు ఏం పెట్టినా మోహమాటపడకుండా తినేస్తాడు. ఆలస్యమైతే ఏ గుడిసె ముందో కుక్కిమంచం వేయించుకుని పడుకుంటాడు. రోడ్డు పక్కన బోరింగు వద్ద స్నానం చేస్తాడు… దగ్గరలో ఏదైనా గుడి ఉంటే వెళ్లి, కాసేపు పూజ చేసుకున్నాడంటే చాలు, ఇక ప్రయాణమే ప్రయాణం… ఏదైనా దూర ప్రయాణం అనుకొండి, వెంట ఓ బ్యాగు ఉంటుంది.
ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు, తన కోటాకు వచ్చే అభివృద్ధి నిధులన్నీ మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు, స్కూళ్లకు వెచ్చించేస్తాడు . తను పెళ్లి చేసుకోలేదు. తల్లి ఉండేది, గత ఏడాది మరణించింది .వివరాల్లోకి వెళ్తే అతని పేరు ప్రతాప్ చంద్ర సారంగీ. 1955సంవత్సరంలో నీలగిర్ ప్రాంతంలోని గోపీనాథపురం, ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఉత్కళ యూనివర్శిటీ పరిధిలోని బాలాసోర్‌లోనే డిగ్రీ వరకూ చదివాడు. ఆయన మంచి వక్త, డిగ్రీ పూర్తీ కాగానే రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారి, ప్రజాసేవకు అంకితం కావాలనేది ఆయన లక్ష్యం. తన బయోడేటా పరిశీలిస్తూ తనకు విధవరాలైన తల్లి ఉందనీ, ఊళ్లో ఒక్కతే ఉంటుందని తెలిసి అక్కడి గురువులు తనను మందలించారు… తల్లి సేవ చేసుకోపో అని నచ్చజెప్పి పంపించేశారు…ఊరూరూ తిరుగుతూ జనాలకు కావల్సిన పనులు చేసిపెడుతూ తిరిగేవాడు… గణశిక్షామందిర్ యోజన కింద గిరిజన గ్రామాల్లో సమరకరకేంద్రాల పేరిట బడులు ప్రారంభించటానికి ఎక్కువగా కృషి చేసేవాడు.
చదువు ఉంటే చైతన్యం, ఆరోగ్యం, సంపద అన్నీ సమకూరతాయని నమ్మే వ్యక్తి తను, చదువు గురించి గ్రామాల్లోకి వెల్లి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టేవాడు. ఇతని సామాజిక సేవ దృక్పధాన్ని చూసిన బీజేపీ అతన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది. 2004లో నిలగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించాడు. ఆతర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా మరోసారి విజయం సాధించారు. పదేళ్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన తీరు మారడం లేదు. ఆయకు ఉండటానికి ఇళ్లు కూడా లేదు. సామాన్య ప్రజల వద్దే ఉంటాడు. ఆయన ఒక పూరి గుడిసెలో జీవనం సాగిస్తుంటాడు. ఎమ్మెల్యేగా అతనికి వచ్చే జీతాన్ని కూడా పేద ప్రజలకే ఇచ్చేస్తాడు. ఇక 2014లో జరిగిన ఎన్నిక్లో బాలసోర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి చేతిలో ఓడిపోయాడు. అయినా అధైర్య పడలేదు. పదవి ఉన్నా లేకపోయానా ప్రజా సేవకే అంకితమయ్యాడు. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ఎంపీగా పోటీ చేశారు. ఈసారి 12వేల మెజార్టీతో విజయం సాధించారు. ప్రతాప్ చంద్ర సారంగి తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఎంపీగా గెలిచాడంటే అతని ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనమే అర్ధం చేసుకోవాలి. కొన్ని వందల కోట్లు ఖర్చు చేసినా గెలవని ఈ రోజుల్లో కేవలం అతని మంచితనాన్ని చూసి ప్రజలు ఓట్లు వేశారు. పార్లమెంట్ కు పొతావు కదా ఢిల్లీలో ఎక్కడుంటావ్ అని అడిగితే ఢిల్లీలో రైల్వే ప్లాట్‌ఫారాలుండవా..? రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లు ఉండవా అని సమాధానం ఇస్తాడు. ఇలాంటి రోజుల్లో ప్రతాప్ చంద్ర సారంగీ రాజకీయ నాయకులు ఉన్నందుకు గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవాలి.