ఏపీ పిసిసి అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా

170
Raghuvera Reddy

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కక ఎంపీ, ఎమ్మెల్యేను కూడా గెలచుకోలేదు. ఇందుకు నైతిక బాధ్యతవహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

ఆ రాజీనామా లేఖను ఏఐసీసీ ఛీప్ రాహుల్ గాంధీ కి పంపించారు. దీనిపై రాహుల్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రఘువీరా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపొయిన చోట్ల పలువురు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.