ప్రస్థానం,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో డీలా పడ్డా సందీప్ ప్రస్తుతం నిను వీడని నీడను నేనే అనే మూవీ చేస్తున్నారు. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఓ నిర్మాత తనను యాక్టింగ్ మానేయాలని సూచించాడని ఆ కసితోనే తానే నిర్మాతగా మారి నిను వీడని నీడను నేనే అనే మూవీని తెరకెక్కించానని తెలిపారు.తెలుగుతో పాటు తమిళ్‌లో విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
హర్రర్,రొమాన్స్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన అన్యసింగ్ హీరోయిన్‌గా నటించింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్‌తోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న సందీప్ కిషన్ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.