పురుషుల్లో బట్టతలకు..కారణాలు ఇవే !

28
- Advertisement -

నేటి రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో బట్టతల ముందు వరుసలో ఉంటుంది. ఈ సమస్య మహిళల కంటే పురుషులను అధికంగా వేధిస్తుంది. సాధారణంగా బట్టతల అనేది వయసు పైబడిన వారిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ నేటిరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు బట్టతలతో బాధపడుతున్నారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా బట్టతల రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కొందరిలో వంశపారపర్యంగా జన్యులోపం కారణంగా బట్టతల వస్తుంది. మరికొందరిలో హార్మోన్స్ లోపం వల్ల కూడా బట్టతల వేధిస్తుంది. ముఖ్యంగా మగవారిలో ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ తగ్గడంవల్ల పురుషుల్లో బట్టతల ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట. .

ఇంకా పలు రకాల ఆరోగ్య సమస్యల కారణంగా కూడా పురుషుల్లో ఈ బట్టతల సమస్య కనిపిస్తుంది. హైబీపీ, డిప్రెషన్, మానసిక ఆందోళన గురయ్యే వారిలో బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా పురుషుల్లో ధైరాయిడ్ గ్రంథి సమస్య కూడా బట్టతలకు కారణమౌతుంది. ఇంకా ధూమపానం, మద్యపానం సేవించే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువే. అలాగే హానికరమైన రసాయనాలు కలిగిన షాంపు, క్రీమ్, వాడడం కూడా జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది.

కాబట్టి ఈ చిన్న వయసులోనే బట్టతల రాకుండా ఉండాలంటే కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తింటే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇంకా ప్రతిరోజూ వ్యాయామం చేయడం, యోగా చేయడం అలవాటు చేసుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాంటి మానసిక ఒత్తిడి ఆందోళన వంటి వాటికి గురికాకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే జుట్టురాలే సమస్య నుంచి కొంతైనా బయట పడవచ్చు.

Also Read:ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు..

- Advertisement -