అది మా తప్పే!

5
- Advertisement -

ప్రముఖ హెల్త్ ఫుడ్ బ్రాండ్ ‘ది హోల్ ట్రూత్’ (The Whole Truth) తమ ఉత్పత్తులపై ఉన్న నో యాడెడ్ షుగర్ (అదనపు చక్కెర కలపలేదు) అనే లేబుల్‌ను స్వీటెండ్ విత్ డేట్స్ (ఖర్జూరాలతో తీపి చేసినది) గా మార్చడానికి అంగీకరించింది.

ఈ బ్రాండ్‌కు భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ (FSSAI) షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకుంది. ఈ వివాదాన్ని వారి ప్రత్యర్థి చాక్లెట్ బ్రాండ్ ‘పాల్ అండ్ మైక్ తెరపైకి తెచ్చింది. పాల్ అండ్ మైక్ సంస్థ 2024 లోనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) కి ఫిర్యాదు చేసింది. ది హోల్ ట్రూత్ సంస్థ తన ఉత్పత్తులను తీపి చేయడానికి ఖర్జూరాల పొడిని (Date powder) వాడుతూ ప్యాకేజింగ్‌పై మాత్రం ఎలాంటి చక్కెర కలపలేదని క్లెయిమ్ చేస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

దీనిపై ది హోల్ ట్రూత్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శశాంక్ మెహతా .. లింక్డ్‌ఇన్ వీడియో ద్వారా స్పష్టతనిచ్చారు. ‘యాడెడ్ షుగర్’ (అదనపు చక్కెర) అనే పదానికి ఉన్న నిర్వచనం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని శశాంక్ మెహతా తెలిపారు. తమ చాక్లెట్లలో ఎలాంటి మార్పు రాలేదని అది ఇప్పటికీ 71% కోకో మరియు 29% ఖర్జూరాల కలయికతోనే తయారవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఈ రెండు పదార్థాలను మాత్రమే తాము వాడుతున్నామని వాటి ఖచ్చితమైన శాతాన్ని కూడా ప్యాకెట్ ముందు భాగంలో పెద్ద అక్షరాలతో ముద్రిస్తున్నామని చెప్పారు.తమ ఉత్పత్తులలో ఖర్జూరాల సిరప్‌కు బదులుగా ఖర్జూరాల పొడిని ఉపయోగిస్తున్నామని, దీనివల్ల ఖర్జూరాలలో ఉండే పీచు పదార్థం మరియు సూక్ష్మపోషకాలు అలాగే ఉంటాయని ఆయన వివరించారు.

ఈ ఖర్జూరాల పొడి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కేవలం 43 మాత్రమేనని, ఇది చక్కెర (GI 65) కంటే చాలా తక్కువని ల్యాబ్ పరీక్షల్లో తేలిందని ఆయన పేర్కొన్నారు. అందువల్లనే ఇది అదనపు చక్కెర లాగా పనిచేయదని తాము భావించామని చెప్పారు. FSSAiనిబంధనల ప్రకారం… చక్కెర కలిగిన ఏ పదార్థాన్ని తీపి కోసం వాడినా దాన్ని ‘నో యాడెడ్ షుగర్’ అని పిలవకూడదు. ఈ కారణంగానే తమ లేబుల్‌ను మార్చాల్సిందిగా అధికారులు కోరారని తాము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

Also Read:విజయన్‌కు షాక్..ఈడీ రైడ్స్!

- Advertisement -