కేరళ మాజీ సీఎం, సీపీఎం నేత పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ సంస్థ… విజయన్ కుమార్తె టి. వీణకు చెందిన ఐటీ సంస్థ ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’కు 2018 నుండి 2019 మధ్య కాలంలో ఎలాంటి సేవలు అందించకపోయినప్పటికీ… రూ. 1.72 కోట్ల అక్రమ చెల్లింపులు చేసిందనేది ప్రధాన ఆరోపణ.
కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత (LoP) పినరయి విజయన్ కుమార్తె వీణ తైకండియిల్ సంస్థ ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం కేరళవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
అధికారుల సమాచారం ప్రకారం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం తిరువనంతపురంలోని విజయన్ అద్దె ఇల్లు మరియు ఇతర 12 ప్రాంతాలలో ఈడీ ఈ దాడులు నిర్వహిస్తోంది.
Also Read:పెద్ది..చరణ్ విశ్వరూపం చూస్తారు!
ఈ కేసులో ఈడీ జరుపుతున్న విచారణను కొట్టివేయాలంటూ సీఎంఆర్‌ఎల్ (CMRL) దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఈడీ 2024 లోనే పీఎంఎల్‌ఏ (PMLA) కింద కేసు నమోదు చేసింది.

