వాల్తేరు వీరయ్య మెయిన్ ట్విస్ట్ అదే

58
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహా రాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా ఇంటర్వెల్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఇంటర్వెల్ దగ్గరే మెగాస్టార్ – రవితేజ క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని.. సినిమా మొత్తంలోనే ఈ ట్విస్ట్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. పైగా సినిమాకే మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటో చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం రవితేజ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ ట్విస్ట్ రివీల్ అవుతుందట.

కాగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో మెగాస్టార్ కి చార్ట్‌ బస్టర్ ఆల్బమ్‌లు ఇచ్చాడు దేవి. అందుకే.. ఈ సినిమా విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ పై చాలా అంచనాలు ఉన్నాయి. మరోపక్క ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రవితేజ క్యారెక్టర్ కూడా స్పెషల్ గా ఉంటుందట. ఇక శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య పై భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే దర్శకుడు బాబీకి ఇంతవరకు భారీ కమర్షియల్ హిట్ కొట్టిన హిస్టరీ లేదు. మరి ఈ సినిమాతో అతను ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -